BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 03:38 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

అక్రమ బ్లాస్టింగ్ లపై ఫిర్యాదు విచారణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
30 Mar, 2026 - 03:38 PM
574 వీక్షణలు

అక్రమ బ్లాస్టింగ్ లపై ఫిర్యాదు విచారణ జరిపిన బొమ్మలరామారం మండల తహసిల్దార్ పి.శ్రీనివాసరావు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో రాత్రి సమయంలో అతి భారీ బ్లాస్టింగ్ తో ఇండ్ల పైకప్పులు, పెచ్చులు ఊడి పడిపోతున్నాయని క్రషర్లపైన తగు చర్య తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు  ఫిర్యాదు చేయడంతో మైనింగ్ శాఖ  ఆదేశాల అనుసారం రామలింగంపల్లి రెవెన్యూ పరిధిలోగల క్రషర్ లను బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్నా ఇల్లులను సోమవారం రోజున మండల తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ ఇచ్చిన ఆదేశాలనుసారం విచారణ జరిపామని తెలిపారు పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపడం జరుగుతుందని అన్నారు ఈ విచారణలో పాల్గొన్న రామలింగంపల్లి సర్పంచ్ సుంచు యాదగిరి మాట్లాడుతూ రామలింగంపల్లి గ్రామంలో భయానిక పరిస్థితి నెలకొన్నదని అన్నారు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న బాలాజీ క్రెషర్ కంపెనీ, రెయిన్ బో కంపెనీ,ఎస్వీఆర్ కంపెనీ,ఆర్ కే డి కంపెనీల వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి అని అన్నారు గ్రామ పరిసర ప్రాంతాల్లో పరిమితికి మించి బ్లాస్టింగ్ (Blasting) నిర్వహించడం వల్ల ఇళ్ల గోడలు, పెచ్చులు పగిలిపోతున్నాయి అని అన్నారు దీంతో కొన్ని ఇళ్లలో పెచ్చులు  ఉడిపోవడంతో ఎప్పుడు కూలిపోతాయో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు  ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది అని అన్నారు గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్లాస్టింగ్ పనులను నియంత్రించాలని, నష్టపోయిన ఇళ్లకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు