BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 05:35 pm
Posted by : యామనూరి మల్లికార్జున

అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 05:35 PM
69 వీక్షణలు

అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం

రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ. 

ఇందులో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం. 

రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు కొనుగోలు చేసిన ప్రభుత్వం

రూ.10 కోట్ల వ్యయంతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం

పరికరాలు, వాహనాలను గురించి ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు

కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకున్న అధికారులను అభినందించిన సీఎం

ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం

రాజధానితో పాటు ఇప్పుడు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్‌లు నిర్మాణం అవుతున్నాయని..వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాలా ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలన్న సీఎం

గతంలో అగ్నిమాపక విభాగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేవాళ్లమని...ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి రావాలన్న ముఖ్యమంత్రి

విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఉందన్న సీఎం చంద్రబాబు

అన్ని సవాళ్ళను అధిగమించి...కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని బలోపేతం అవ్వాలన్న ముఖ్యమంత్రి

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ పీవీ రమణ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు పోలీస్ అధికారులు.