BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 02 April 2026, 10:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతికి రాజ్యసభ ఆమోదం – చింతలపూడిలో ఘన సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 10:19 PM
180 వీక్షణలు

అమరావతికి రాజ్యసభ ఆమోదం – చింతలపూడిలో ఘన సంబరాలు

చింతలపూడి, గురువారం: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంతో చింతలపూడి నియోజకవర్గంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, అమరావతికి రాజ్యసభ ఆమోదం ఐదు కోట్ల ఆంధ్రుల చరిత్రలో సువర్ణాధ్యాయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రజలకు అంకితం చేయడంలో చేసిన కృషి అపారమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సేవలు అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు.

రాజ్యసభ ఆమోదంతో అమరావతి శాశ్వత రాజధానిగా అవతరిస్తుందని, రాష్ట్ర ప్రజలందరికీ ఇది గర్వకారణమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో విద్యుత్ దీపాలతో అలంకరణలు చేసి, బాణసంచా కాలుస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. చింతలపూడిలో “జై అమరావతి” నినాదాలతో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఆకట్టుకుంది.

అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.