BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 11 April 2026, 07:27 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
11 Apr, 2026 - 07:27 PM
295 వీక్షణలు

అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శం--ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు.శనివారం రోజున మహాత్మ జ్యోతిబా ఫూలే  200వ జయంతి సందర్బంగా జగదేవ్ పూర్ చౌరస్తా,భువనగిరిలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్బంగా ప్రభుత్వం విప్,ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య,భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వాణి,వైస్ చైర్మన్ మంజుల, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేణుక బాబు రావు,గ్రంధాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ,ప్రజా ప్రతినిధులు, బిసి సంఘం సభ్యులు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విప్ మాట్లడుతూ  మహాత్మా జ్యోతిరావు ఫూలే  ప్రపంచ మేధావి, విద్యా సంస్థలు నెలకొల్పి విద్యా ద్వారా అన్ని సాధించవచ్చనే  ఉద్దేశంతో తన తో పాటు తన సతీమణి కూడా విద్యాభ్యాసం చేసి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా పనిచేసారు. బాల బాలికలకు విద్యాభ్యాసం నేర్పించిన ఘనత ఆమెదే అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే  మహిళలకు ప్రభుత్వంకు   పెద్ద పీట వేసిందని, మహిళల లకు మహాలక్ష్మి పధకం తీసుకొని రావడం జరిగిందని అన్నారు.బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి సంస్కర్తల్లో ఒకరని, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి.సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణకు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయాలను అనుసరించి ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు .జిల్లా స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లడుతూ సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని తెలిపారు. ఆయన ఆశయంతో మనమందరం ముందుకు వెళ్లాలన్నారు.అంతకంటే ముందు తెలంగాణ  సాంస్కృతిక సారథి కళాకారుల బృందం మహనీయులను స్మరిస్తూ పాడిన పాటలు అందరిని అలరించాయి.ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితి, బి. సి కుల సంఘాల సభ్యులు,వివిధ కుల సంఘాల సభ్యులు, ప్రజా ప్రతి నిధులు,తదితరులు పాల్గొన్నారు.