BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 April 2026, 11:01 am
Posted by : యామనూరి మల్లికార్జున

అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
19 Apr, 2026 - 11:01 AM
68 వీక్షణలు

అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం

నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం


ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం ఈనెల 20న జరగనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోజూ లక్షలాదిమంది పేదల ఆకలిని తీరుస్తున్న అన్న క్యాంటీన్లకు ఏటా 50 లక్షల రూపాయల విరాళం అందచేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి.అన్న క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రభుత్వానికి ఇంతకుముందే కోటి రూపాయల విరాళం అందచేశారు. అన్న క్యాంటీన్లలో సీఎం చంద్రబాబుతో కలిసి స్వయంగా ఆమె భోజనాలు వడ్డిస్తుంటారు. దీనికి తోడు చంద్రబాబు జన్మదినోత్సవం వేళ ఏటా 50లక్షల విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం గొప్ప కార్యక్రమమని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో మహత్తర కార్యక్రమానికి మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో విరాళం అందించామన్నారు. ఇటీవల తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్న ప్రసాదానికి  44 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.నారా  దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ విరాళం అందిస్తూ, చంద్రబాబు కుటుంబం స్వయంగా అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.