BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 01 May 2026, 09:07 pm
Posted by : RAMU JAJU

అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 May, 2026 - 09:07 PM
163 వీక్షణలు

గంగపుత్రుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం..

డొంకేశ్వర్ (అన్నారం): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరారు. చేపల వలలు, బెలూన్లతో అలంకరించిన ప్రత్యేక పందిరితో ఊరేగింపుగా చెరువు గట్టున ఉన్న గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. మహిళలు ఆలయం చుట్టూ ఐదు మార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. గ్రామస్తులంతా చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.