BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 February 2026, 07:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీసీవై రాష్ట్ర యూత్ కో–కన్వీనర్‌గా

తెలంగాణ
01 Feb, 2026 - 07:19 AM
217 వీక్షణలు
బీసీవై రాష్ట్ర యూత్ కో–కన్వీనర్‌గా పూల ప్రేమ్ కుమార్ నియామకం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు ఆంధ్రప్రదేశ్ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) యూత్ విభాగం రాష్ట్ర కో–కన్వీనర్‌గా పుంగనూరుకు చెందిన న్యాయవాది పూల ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పట్ల ప్రేమ్ కుమార్ చూపుతున్న అంకితభావం, యువతలో ఆయనకున్న ఆదరణ, ప్రజా సమస్యలపై చురుకైన పోరాట తత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కీలక బాధ్యతను అప్పగించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రజాసేవ, విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పూల ప్రేమ్ కుమార్ స్వగ్రామం పుంగనూరు పట్టణం. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో స్వయంసేవక్‌గా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గో సంరక్షణ, హిందూ ధర్మ ప్రచారం, జాతీయ భావజాల విస్తరణలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యార్థుల హాస్టల్ వసతి, భోజనం, విద్యా సౌకర్యాలపై ఉద్యమాలు నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుల జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించారు. యువత రాజకీయాల్లోకి రావాలని, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. గతంలో భారతీయ జనతా పార్టీ పుంగనూరు నియోజకవర్గం కో–కన్వీనర్‌గా పనిచేసిన ప్రేమ్ కుమార్, ప్రజా సమస్యలపై బీసీవై పార్టీ చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితుడై 2025లో పార్టీకి చేరారు. నియామకంపై స్పందన ఈ సందర్భంగా పూల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, మత్స్యకారుల సమస్యలపై బీసీవై పార్టీ చేస్తున్న పోరాటాలు తనను ఆకర్షించాయని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, నిరుద్యోగులకు ఉపాధి, రిజర్వేషన్లు, కులగణన, పోలవరం, రాయలసీమకు సాగునీరు వంటి అంశాలపై పార్టీ ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. #BCVY #BCVYYouth #YouthPolitics #APPolitics #PoliticalAppointment #PunganurNews #YouthLeadership Follow us on Website Facebook Instagram YouTube