BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 08 April 2026, 07:56 pm
Posted by : కూనురు మధు

బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్ ఐ ఆర్ నమోదు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
08 Apr, 2026 - 07:56 PM
263 వీక్షణలు

బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్ ఐ ఆర్ నమోదు 

ప్రజలకు న్యాయం చేకూర్చడంలో యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు సరికొత్త ఒరవడిని శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉన్న బాధితుల వద్దకే స్వయంగా వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి, అక్కడికక్కడే ఆన్-సైట్ ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే దుబ్బాక గ్రామానికి చెందిన మెడబోయిన పరుశురాములు అదృశ్యం కావడంతో అతని తల్లి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎస్‌.ఐ. నాగరాజు ఆదేశాల మేరకు సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. అర్రూరుకు చెందిన వాకిటి నర్సింహ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన స్టేషన్‌కు వచ్చే స్థితిలో లేకపోవడంతో, హెడ్ కానిస్టేబుల్ బృందం హాస్పిటల్‌కే వెళ్లి బాధితుడి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్‌కు రాలేకున్నా ఆందోళన చెందాల్సిన పనిలేదు. బాధితులకు న్యాయం త్వరగా అందాలనే ఉద్దేశంతోనే ఈ ఆన్-సైట్ ఎఫ్‌.ఐ.ఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామని రామన్నపేట ఎస్సై డి. నాగరాజు తెలిపారు. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, సేవా దృక్పథంతో ప్రజల వద్దకే రావడం అభినందనీయమని కొనిాడుతున్నారు.