BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 April 2026, 04:58 pm
Posted by : సిర మహేష్

బడిబాట కార్యక్రమంలో వెల్లంకి ఉపాధ్యాయులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
03 Apr, 2026 - 04:58 PM
309 వీక్షణలు

బడిబాట కార్యక్రమంలో వెల్లంకి ఉపాధ్యాయులు


రామన్నపేట మండలం ప్రాథమిక పాఠశాల వెల్లంకి ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని  గుడ్ ఫ్రైడే సెలవు అయినప్పటికీ కూడా విద్యార్థులతో కలిసి నిర్వహించడం జరిగింది. ముందుగా బడిబాట కార్యక్రమం యొక్క కరపత్రమును గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్  మరియు కరపత్ర దాతలు బత్తుల శ్రీనివాస్  ,AAPC చైర్ పర్సన్ శ్రీమతి పులగం సులోచన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పల్లె మోహన్ రెడ్డి గారలు సంయుక్తంగా ఆవిష్కరించడం జరిగింది. తదుపరి బడిబాట కార్యక్రమం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లలను చేర్పించాలని కోరడం జరిగింది. వారి నుండి మంచి స్పందన రావడం జరిగింది. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి ఈడెం రాధా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విలువైన ఉచిత విద్య లభిస్తుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల బలోపేతానికి సహకరించాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఇట్టే సోమిరెడ్డి , ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసన మాధవి,  నకిరేకంటే అశ్విని పాల్గొనడం జరిగింది.