BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 08:06 pm
Posted by : బాల్ధా భాస్కర్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
23 Apr, 2026 - 08:06 PM
230 వీక్షణలు

బీబీనగర్ మండల కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.

బీబీనగర్ మండలంలోని చిన్నారావులపల్లి , బ్రాహ్మణపల్లి, రాఘవాపూర్ ,గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.ధాన్యం తేమ శాతం,తూకం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు.ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,యూత్ కాంగ్రెస్ నాయకులు ,అధికారులు,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.