BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 09:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 09:02 PM
64 వీక్షణలు

బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం

పట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఘన విజయం సాధించారు. మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన బంకీపూర్‌లో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో ఈ ఫలితం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

బంకీపూర్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు నామినేట్ కావడంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో జన్ సురాజ్ తరఫున బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్, బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించి రాజకీయంగా తన సత్తా చాటారు.

బంకీపూర్‌ను గత 30 ఏళ్లుగా బీజేపీ తన బలమైన కోటగా నిలబెట్టుకుంది. అలాంటి నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు ఎన్నికల వ్యూహకర్తగా పలు పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ విజయాన్ని నమోదు చేయడం విశేషంగా మారింది. ఈ గెలుపుతో జన్ సురాజ్ పార్టీకి కొత్త ఉత్సాహం లభించగా, రానున్న బిహార్ రాజకీయాలపై ఈ ఫలితం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.