BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 09:54 am
Posted by : V శ్రీనివాస్

బీసీ గ్యారంటీలను అమలు చేయాలి

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 09:54 AM
191 వీక్షణలు

బీసీ గ్యారంటీలను అమలు చేయాలి: మంచిర్యాలలో ‘లక్ష సంతకాల సేకరణ’ ప్రారంభం

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బీసీ సంక్షేమ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘లక్ష సంతకాల సేకరణ’ ఉద్యమం ప్రారంభమైంది. బుధవారం మంచిర్యాల కార్పొరేషన్ ముల్కల అంబేద్కర్ విగ్రహం వద్ద సమితి నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా బీసీ సబ్ ప్లాన్, సివిల్ పనుల్లో 42% రిజర్వేషన్లు, రూ. 10 లక్షల విద్యా రుణం వంటి కీలక హామీలను విస్మరించిందని మండిపడ్డారు. బీసీల ఓట్ల కోసమే మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, శాఖపూరి భీమ్సేన్, వేముల అశోక్, కీర్తి రవి, రామగిరి రాజన్న చారి, ధర్మాజీ సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు