BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 28 March 2026, 03:41 pm
Posted by : V శ్రీనివాస్

బిసి డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 7న 24 గంటల నిరవధిక దీక్ష

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 03:41 PM
160 వీక్షణలు

 బి.సి డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 7న 24 గంటల నిరవధిక దీక్ష

మంచిర్యాల 

బి.సి కులాల చిరకాల డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల ఏప్రిల్ 7వ తేదీ, మంగళవారం నాడు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జాతీయ బి.సి హక్కుల పోరాట సమితి ప్రకటించింది.

ముఖ్య అంశాలు:

గత 40 సంవత్సరాలుగా దేశంలో మరియు రాష్ట్రంలో బి.సి డిమాండ్ల సాధనకై అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నేటికీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం పట్ల సమితి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఈ మొండి వైఖరిని "బి.సి వ్యతిరేక విధానం"గా వారు అభివర్ణించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, నాయకులు షాకపూరి భీమ్సేన్, చంద్రమౌళి మాట్లాడుతూ... బి.సి కుల సంఘాలు, బి.సి మేధావులు మరియు కుల బాంధవులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ 24 గంటల నిరవధిక దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బి.సి ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు