BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 March 2026, 03:08 pm
Posted by : V శ్రీనివాస్

బొగ్గు గని పెన్షనర్ల ఆవేదన: ఈ నెల 30న మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మహా ధర్నా

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 03:08 PM
297 వీక్షణలు

గత 28 ఏళ్లుగా పెరగని పెన్షన్లు – సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆగ్రహం

పార్లమెంట్‌లో గళమెత్తుతున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు

మంచిర్యాల మార్చి 26: గత 28 ఏళ్లుగా పెన్షన్ పెంపునకు నోచుకోక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొగ్గు గని విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్‌లో జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమావేశం గజెల్లి వెంకటయ్య అధ్యక్షతన జరిగింది.

న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోల్ ఇండియా పెన్షనర్లు చేపట్టిన ధర్నాకు మద్దతుగా, ఈ నెల 30న ఉదయం 10 గంటలకు మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధాన డిమాండ్లు:

గత 28 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కోల్ మైన్స్ పెన్షన్‌ను కరువు భత్యంతో కలిపి 50 శాతానికి పెంచాలి.

1989 నాటి పాత కోల్ మైన్స్ పెన్షన్ ఒప్పందాన్ని తక్షణమే సవరించాలి.

CPMRS హెల్త్ కార్డ్ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి మెరుగైన వైద్యం అందించాలి.

2016 నుండి పెరిగిన గ్రాడ్యుటీ సీలింగ్ 20 లక్షల రూపాయలను వెంటనే చెల్లించాలి.

అర్హులైన విశ్రాంత ఉద్యోగులకు ఆసరా పెన్షన్లు, వైట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి. ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను ఇళ్లు లేని విశ్రాంత ఉద్యోగులకు కేటాయించాలి.

ఈ సందర్భంగా పెన్షనర్ల సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతూ, కోల్ ఇండియా యాజమాన్యంతో పోరాడుతున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి సమావేశం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

సమావేశంలో పాల్గొన్న వారు:

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆర్ రాజన్న, అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పి నర్సయ్య పాల్గొన్నారు. వీరితో పాటు మందమర్రి ఏరియా నాయకులు రామ్ రావేందర్, కొమురయ్య, తిరుపతి రాజు; శ్రీరాంపూర్ నాయకులు నూనె మల్లయ్య; నస్పూర్ నాయకులు బింగి రాజేశం, కలవుల చంద్రయ్య; గోలేటి నాయకులు గోపాల కృష్ణ; బెల్లంపల్లి నాయకులు శ్రీనివాస్; రామకృష్ణాపూర్ నాయకులు కాలువల నర్సయ్య; మంచిర్యాల జిల్లా నాయకులు సత్యనారాయణ రావు, గోపతి లక్ష్మణ్, అడిచర్ల రాజేశం, రామ్ లాల్, దేవులపల్లి లక్ష్మి నారాయణ, అంజన్న, నరేష్, మంచాల రామన్న, పోతురాజుల చంద్రయ్య, ఎం రాంబాబు, సల్లా రాజిరెడ్డి, సర్వేశ్వర చారి తదితరులు పాల్గొన్నారు