BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 08:17 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

బస్వాపురం ప్రాజెక్టు కాలువను పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
21 Mar, 2026 - 08:17 PM
231 వీక్షణలు

బస్వాపురం ప్రాజెక్టు కాలువను పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

జలయజ్ఞంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి కాలువలు మళ్ళీ కాంగ్రెస్ హయంలోనే పూర్తయ్యాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.భువనగిరి వద్ద వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారి కింది నుంచి వెళ్లే బస్వాపురం ప్రాజెక్ట్ కాలువను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం రోజున పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మాత్రమే మన ప్రాంతానికి నీరు వస్తుందని,కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కాదని స్పష్టం చేశారు. బస్వాపురం ప్రాజెక్టు నుంచి కాలువల నిర్మాణం ద్వారా వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే ప్రారంభమయ్యాయని, ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.  భువనగిరి వద్ద వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారి కిందనుంచి  వెళ్ళే ఈ కాల్వను గత ప్రభుత్వం పట్టించుకోకు పోవడం వల్ల  కాలువల ద్వారా చెరువులకు నీరు అందలేదని అన్నారు. ప్రస్తుతం ఈ కాలువ పూర్తి కావటం తో  భువనగిరి, వలిగొండ  మండలాలలో చెరువులు నింపి పంట పొలాలకు నీరు అందించే కార్యక్రమం మొదలైందని అన్నారు.ఏడున్నర కోట్ల ఖర్చుతో కల్వర్టు నిర్మానం పూర్తిచేసి నీరు అందిస్తున్నట్టు తెలిపారు.బసవపురం ప్రాజెక్టులో ఇంకా పూర్తిస్థాయి లో నీళ్లు నింపలేదనీ ముంపు గ్రామం బి ఎన్ తిమ్మాపురం లో ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇంకా  కొంత మంది కి పరిహారం అందలే దని, మరో 50 కోట్లు నిధులు విడుదల చేస్తే బి ఎన్ తిమ్మాపూర్ గ్రామం ఖాళీ అయ్యి నీళ్లు నింపడానికి అనువుగా ఉంటుందన్నారు.  ప్రస్తుతం బస్వాపురం ప్రాజెక్టు 0.7 టీఎంసీల  నీరు నిల్వ సామర్థ్యం ఉందన్నారు.భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద కూడా రోడ్డును కటింగ్ చేసి కాల్వ ద్వారా నీరు వెళ్లేలా చేసే కార్యక్రమం చేయబోతున్నట్లు తెలిపారు.మరో పైపు హైలెవల్ కాలువ నిర్మాణం ద్వారా వడపర్తి కత్వా కు నీరు వచ్చేలా భూసేకరణ మొదలైందని, మరో 6 నుంచి 7 కోట్ల విలువ చేసే భూ సేకరణ పూర్తి అయితే హైలెవల్ కాలువ పూర్తి అయి... వడపర్తి నుంచి బీబీ నగర్ చెరువుకు నీరు అందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు