BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 April 2026, 02:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డా||బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 02:47 PM
205 వీక్షణలు

భారత రత్న డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మోరంపూడి శ్రీనివాస రావు ఘన నివాళి

"విద్య పొందండి, సంఘటితమవ్వండి, పోరాడండి"అనే డా. బీ ఆర్ అంబేద్కర్ సందేశం  యువతకు మార్గదర్శనం అని నూజివీడు నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.

మంగళవారం ఉదయం భారత రత్న డా. బీ. ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో స్వర్గీయ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, విద్యా వేత్త, న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ న్యాయ శాఖా మంత్రి, భారత రత్న స్వర్గీయ డా. భీమ్ రావ్ , రాంజీ అంబేద్కర్ కుల వివక్ష కు వ్యతిరేకంగా, స్వేచ్ఛ, సమానత్వం కోసం జీవితాంతం పోరాడారు అని మోరంపూడి కొనియాడారు.

అతి సామాన్య దళిత కుటుంబంలో పుట్టి ,అంటరానితనానికి లోనై, అస్పృశ్యత కు గురై, వాటిని లెక్కచేయకుండా బాగా చదువుకొని భారత రాజ్యాంగాన్ని  రచించే మహదావకాశాన్ని అందిపుచ్చుకున్నారనీ మోరంపూడి అన్నారు.

విద్య లేక పోతే స్వేచ్ఛ లేదు, సంఘటితం కాకపోతే శక్తి లేదు, పోరాడకపోతే మార్పు రాదు అని యువత కు గట్టిగా అంబేద్కర్ ఉద్బోధించారు అని మోరంపూడి గుర్తు చేశారు.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కూడా అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేశారనడానికి నిదర్శనమే కే ఆర్ నారాయణన్ ని రాష్ట్రపతి ని చేయడం గానీ, బాలయోగి నీ లోక్ సభ కు స్పీకర్ ని చేయడం గానీ అని మోరంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వర రావు, నక్కా రాము, జక్కంపూడి ప్రదీప్, నెక్కళపు వెంకటేశ్వర రావు, గార్లపాటి మారేష్,బొంతు సతీష్, గవర వెంకటేశ్వర రావు, మోదుగు ముత్తయ్య, మోదుగు లక్ష్మీ విమల కుమారి, విస్సంపల్లి రాజా, కందుల కృష్ణ, మౌలాలి, గత్తం రాజు, ఫిరంగి పుల్లయ్య, మోరంపూడి రమేష్, విస్సంపల్లి ప్రసాద్,కూటమి నాయకులు,కార్యకర్తలు, దళిత నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.