BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 17 May 2026, 05:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భగవద్గీత పారాయణంలో బంగారు పతకం సాధించిన చిన్నంపేట వాసి సునీత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 05:30 PM
454 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన నృసింహాద్రి సునీత భగవద్గీత పారాయణంలో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించారు. గత ఏడాది కాలంగా మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో నిర్వహించిన శ్రీమద్భగవద్గీత పారాయణ తరగతుల్లో పాల్గొన్న సునీత, భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను కంఠస్థం చేసి తన ప్రతిభను చాటుకున్నారు.

ఈ నెల 10వ తేదీన మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి సునీతను బంగారు పతకం, ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు.

ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సునీత భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి, అనేక మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.