BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

బలహీన వర్గాల బద్ధ శత్రువు బిజెపి

తెలంగాణ
28 Nov, 2025 - 06:18 AM
89 వీక్షణలు

బలహీన వర్గాల బద్ధ శత్రువు బిజెపి

పూలే ఆశయాల సాధనకు పునరంకితం కావాలి -కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్ బాబు NTODAY NEWS: హైదరాబాద్ కేంద్ర బిజెపి సర్కారు బలహీన వర్గాలకు బద్ధ శత్రువుగా నిలుస్తుందని పూలే విగ్రహాలకు దండలు వేసి ఆయన ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ అంబర్ పేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహనికి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం విగ్రహం వద్ద కేవీపీఎస్ నగర కార్యదర్శి బిట్ర సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు స్కైలాబ్ బాబు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే శూద్రులు అస్పృశ్యులు మహిళల విద్య కోసం జీవితాన్ని త్యాగం చేశాడని తన జీవిత సహచరి సావిత్రిబాయి పూలేను మొట్టమొదటి ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దాడని కొనియాడారు అందరికీ విద్య కోసం పూలే పాటుపడితే నూతన జాతీయ విద్యా విధానం పేరిట కేంద్ర బిజెపి సర్కార్ కాసులు పెట్టిన కొందరికే ఉన్నత విద్యను అందిస్తుందని, అట్టడుగు వర్గాలకు ఉన్నతఉద్యమ దూరం చేస్తుందని విమర్శించారు నాడు పూలే రైతాంగం పై విధించిన కోటి పన్ను పద్ధతికి వ్యతిరేకంగా పోరాడారని నేడు కేంద్ర బిజెపి సర్కార్ మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టను పెట్టుకుందని విమర్శించారు. ఆయన నాడు బొంబాయి ఇక నూలు మిల్లు కార్మికుల పక్షాన పోరాటం నిర్వహిస్తే నేడు బిజెపి సర్కార్ స్వాతంత్రం కంటే ముందు నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు అమలు చేస్తుందన్నారు తద్వారా ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మికుల శ్రమదోపిడికి పాల్పడుతుందన్నారు బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న బిజెపి బలహీన వర్గాలకు కేంద్ర బడ్జెట్లో ఎంత శాతం నిధులు కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ అడ్డుకుంటున్నదనీ, భాజాప పార్టీ బలహీన వర్గాలకు బద్ద శత్రువు అని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు అందిస్తే గవర్నర్ కేంద్రానికి పంపకుండా పార్లమెంటులో చట్టం చేయకుండా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా బిజెపి బలహీన వర్గాల రిజర్వేషన్లను అడ్డుకుంటుందన్నారు బీసీ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్లు బిజెపికి పరోక్షంగా ఊడిగం చేస్తూ బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు . పూలే ఆశయాల సాధనకు నేటి సమాజం పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా పూలే ఆశయాలు ముందుకు సాగుతాయ న్నారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నగర నాయకులు ఎం మహేందర్ నగర కార్యదర్శి బి సుబ్బారావు. సిఐటియు అంబర్ పేట జోన్ కన్వీనర్ జి రాములు .ఎస్ఎఫ్ఐ జోన్ కన్వీనర్ నాగేందర్. కెవిపిఎస్ నాయకులు . డి వెంకటయ్య జనార్దన్. మల్లేష్ .ఆంజనేయులు. మాధవ్ .కిషన్. అర్జున్. తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube