BREAKING
కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
Date of Publish : 24 July 2026, 03:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 03:54 PM
119 వీక్షణలు

నూజివీడు డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ఏలూరు జిల్లా, చాట్రాయి: చాట్రాయి మండలంలోని సోమవరం, మర్లపాలెం గ్రామాల్లో నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైనట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి. సంజయ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను అపహరించారని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కారణంగా ఆయా గ్రామాల్లోని వ్వవసాయ రైతులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. గ్రామాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని అసిస్టెంట్ ఇంజనీర్ డి. సంజయ్ కోరారు.