BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 25 May 2026, 06:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చదువు రాదన్న సాకు చెల్లదు.. సంతకం పెడితే అప్పు తీర్చాల్సిందే!”

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 May, 2026 - 06:56 AM
201 వీక్షణలు

చోలే కుల్చే విక్రేతకు ఢిల్లీ హైకోర్టు షాక్

పదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తాను నిరక్షరాస్యుడినని, సంతకం చేసిన పత్రాల గురించి తెలియదని చెప్పి చట్టపరమైన బాధ్యతల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది.

ఒక చోలే కుల్చే విక్రేత రూ.2.6 లక్షలు అప్పుగా తీసుకుని, దానికి సంబంధించి ప్రామిసరీ నోట్లు, రశీదులపై సంతకం చేశాడు. అయితే అప్పు తిరిగి చెల్లించే సమయంలో తాను చదువుకోలేదని, పత్రాల్లో ఏముందో తెలియదని, మోసపూరితంగా సంతకాలు తీసుకున్నారని కోర్టులో వాదించాడు.

ఈ వాదనలను తిరస్కరించిన జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్ ధర్మాసనం, “వ్యాపారం చేస్తున్న వ్యక్తి లావాదేవీల సమయంలో నిరక్షరాస్యతను సాకుగా చూపించి బాధ్యతల నుంచి తప్పించుకోలేడు” అని వ్యాఖ్యానించింది.

పత్రాలపై స్వచ్ఛందంగా సంతకం చేసిన తర్వాత వాటి విషయాలు తెలియవని చెప్పడం సమంజసం కాదని కోర్టు స్పష్టం చేసింది. తీసుకున్న అసలు మొత్తంతో పాటు, పదేళ్లుగా సాగుతున్న వివాదానికి సంబంధించిన వడ్డీని కూడా చెల్లించాలని ఆదేశించింది.

2014లో ప్రారంభమైన ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ విక్రేత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

వ్యాపార లావాదేవీల్లో పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేవలం నిరక్షరాస్యతను అడ్డం పెట్టుకుని ఆర్థిక బాధ్యతల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.