BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర

జాతీయం
18 May, 2026 - 08:04 AM
297 వీక్షణలు

చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నూతన వధూవరులు! NTODAY NEWS మహారాష్ట్ర

12 జ్యోతిర్లింగాలను దర్శించిన నూతన వధూవరులు!

నేటి తరం యువత పెళ్లయ్యాక హనీమూన్ కోసం విదేశాలకో, బీచ్‌లకో వెళ్తుంటే.. మహారాష్ట్రకు చెందిన ఒక నూతన వధూవరుల జంట మాత్రం తమ వైవాహిక జీవితాన్ని అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక సంకల్పంతో ప్రారంభించి దేశాన్ని ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన అజిత్ జగతాప్, ప్రియాంక జగతాప్ దంపతులు చెప్పులు లేకుండా ఏకంగా 11,600 కిలోమీటర్లు నడిచి, భారతదేశంలోని పవిత్ర 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు.

* ​9 నెలల కఠిన సాధన ,  అచంచల భక్తి

​ఈ దంపతులు సుమారు తొమ్మిది నెలల పాటు నిరంతరాయంగా ఈ పాదయాత్ర సాగించారు. వాతావరణంలో మార్పులు, మండుటెండ, వాన, చలిని తట్టుకుంటూ రోజుకు సగటున 30 నుండి 40 కిలోమీటర్లు నడిచారు. గుజరాత్‌లోని సోమనాథ్ నుండి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ వరకు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం నుండి తమిళనాడులోని రామేశ్వరం వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జ్యోతిర్లింగాలను కాలినడకన సందర్శించారు. దారిలో ఎన్నో సార్లు అలసట, గాయాలు అయినప్పటికీ.. ఆ పరమశివునిపై ఉన్న భక్తి, జ్యోతిర్లింగాలను దర్శించాలనే దృఢ సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించాయి  అని ఈ జంట ఆనందంగా వ్యక్తం చేశారు. ​

* నేటి తరానికి ఆదర్శం

​ఆధునిక యుగంలోనూ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పట్ల ఈ జంట చూపిన గౌరవం, కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచిన తీరు నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచింది. పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఈ దంపతుల భక్తికి, సాహసానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యూహ్వాత్మకంగా లభిస్తున్నాయి.