BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 05:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చెర్యాల తహసీల్దార్ ఏసీబీ వలలో.. రూ.70 వేల లంచం తీసుకుంటూ పట్టివేత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 05:43 PM
277 వీక్షణలు

సిద్దిపేట జిల్లా చెర్యాల మండల తహసీల్దార్ కొర్రా దిలీప్ నాయక్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. తన కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సమయంలో తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనతో చెర్యాల మండల రెవెన్యూ కార్యాలయంలో కలకలం రేగింది. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌పై తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.

నాలా కన్వర్షన్ అనుమతుల కోసం రూ.70 వేల లంచం.. చెర్యాల తహసీల్దార్ ఏసీబీకి చిక్కాడు

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, నాగపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/B, 833/C, 833/D, 833/E, 834/B, 834/C, 834/D, 834/E పరిధిలోని మొత్తం 30 గుంటల భూమికి సంబంధించిన 11 నాలా (NALA) కన్వర్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి అధికారిక అనుమతులు మంజూరు చేయడానికి చెర్యాల తహసీల్దార్ కొర్రా దిలీప్ నాయక్ రూ.70 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.

ఈ దరఖాస్తుల్లో ఇప్పటికే ఎనిమిది దరఖాస్తులను ప్రాసెస్ చేసిన తహసీల్దార్, మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం కోరినట్లు విచారణలో తేలింది. ఈ భూములు జమున కనకమ్మతో పాటు మరికొందరి పేర్లపై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, తహసీల్దార్ కార్యాలయంలోనే ఆయన రూ.70 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయన వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహించాల్సిన తహసీల్దార్ అధికారిక పనిని పూర్తి చేయడానికి అక్రమంగా లంచం డిమాండ్ చేసి స్వీకరించడం అవినీతి నిరోధక చట్టం కింద నేరమని ఏసీబీ పేర్కొంది.

ఈ కేసులో తహసీల్దార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.