BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 11:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతల భాస్కర రెడ్డి పార్థివ దేహానికి వైసీపీ నేతల నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 11:39 AM
104 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు చింతల భాస్కర రెడ్డి పార్థివ దేహానికి తిరువూరు మాజీ శాసనసభ్యుడు, వైసీపీ సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్‌తో పాటు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, దేశిరెడ్డి రాఘవరెడ్డి, అల్లు గణపతి రెడ్డి, సిరసాని ప్రకాష్ రావు, తాణంకి రాంబాబు తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చింతల భాస్కర రెడ్డి ఉపాధ్యాయుడిగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు ప్రజా సేవకు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. గ్రామ అభివృద్ధి, సామాజిక సేవ, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. నిరాడంబర జీవనం, నిబద్ధత, సేవా తపనతో ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా భాస్కర రెడ్డి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు.

ఆయన మృతి నరసాపురం గ్రామానికే కాకుండా తిరువూరు నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పార్థివ దేహంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.