BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 02 May 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:17 PM
153 వీక్షణలు

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

చింతలపూడి ప్రాంతంలో వంటగ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారాయి. ఒకే ఏజెన్సీ వద్ద సుమారు 25 వేల కనెక్షన్లు ఉండగా, ఇతర ఏజెన్సీల వద్ద కేవలం 5 వేల కనెక్షన్లు మాత్రమే ఉండటంతో అసమతుల్యత ఏర్పడిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగానే సరఫరాలో అంతరాయం కలుగుతోందని వారు అంటున్నారు.

ఒకే ఏజెన్సీకి ఇంత భారీ సంఖ్యలో కనెక్షన్లు ఉండటం కంటే, వాటిని ఇతర ఏజెన్సీలకు సమానంగా బదిలీ చేయవచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు. 5 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు సరిపడా గ్యాస్ సరఫరా ఉంటే, 25 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీకి కూడా అదే స్థాయిలో సరఫరా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, కొందరు సిలిండర్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయా? లేదా ఈ-కేవైసీ పేరుతో ఆలస్యం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. స్పష్టమైన సమాచారం లేక వినియోగదారులు అయోమయంలో ఉన్నారు.

చింతలపూడి ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రజలు కోరుతున్నారు.