చిట్యాల చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
చిట్యాల చేనేత సహకార సంఘం పాలకవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 13 మంది నామినేషన్లు దాఖలు చేయగా, నలుగురు ఉపసంహరించుకోవడంతో పోటీలో తొమ్మిది మంది మిగిలారు. దీంతో ఎన్నికల అధికారి అయూబ్ ఈ 9 మందిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. గంజి సుధాకర్, చెరుపల్లి శ్రీనివాసులు, మిర్యాల వెంకటేశ్వర్లు, కోట రాంబాబు, మిర్యాల ప్రకాష్, వడ్డేపల్లి రాములు, మిర్యాల నరేందర్, గంజి దేవకమ్మ, సంగిశెట్టి చంద్రకళ. పద్మశాలి పెద్దలు గత వారం రోజులుగా జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ ఏకగ్రీవం సాధ్యపడింది. ఈ సందర్భంగా సంఘం పెద్దలకు నూతన పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఈ నెల 9న ఆఫీస్ బేరర్లను ఎన్నుకునేందుకు ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించనున్నారు.