BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీకై టీయూడబ్ల్యూజే (ఐ జే యు) ఎంఈఓ కు వినతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
06 Jul, 2026 - 08:42 PM
343 వీక్షణలు

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నజర్నలిస్టుల పిల్లల జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా జిల్లా విద్యాధికారులు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిట్యాల మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల విద్యాధికారి  సైదా నాయక్‌కు కలిసి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా యూనియన్ నాయకులు  మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం, విద్యాశాఖ సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఇచ్చేలా ఉన్నతాధికారులు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ​ఈ నిరసన ప్రదర్శన, వినతిపత్రం అందజేసిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న, మండల అధ్యక్షుడు మేండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, ఉపాధ్యక్షుడు ఏళ్ల వెంకన్న, సహాయ కార్యదర్శి కూనూరు మధు పాల్గొన్నారు. అలాగే యూనియన్ సభ్యులు మిర్యాల ప్రకాష్, జిట్ట మల్లేష్, అమరోజు వెంకన్న, చికిలంమెట్ల మెహర్ బాబు, కాలిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.