BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 06 July 2026, 08:31 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

తెలంగాణ
/ తెలంగాణ
06 Jul, 2026 - 08:31 PM
146 వీక్షణలు

 | తెలంగాణ | NTODAY NEWS

నిజామాబాద్ జిల్లాలోని న్యాల్కల్ గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు.

పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ప్రశాంత్ (35), సంధ్య దంపతులు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సంధ్య, ప్రియుడు అనిల్ మరో వ్యక్తి వెంకటసాయి సహాయంతో ప్రశాంత్ హత్యకు పథకం రచించారు.

ముందుగా ప్రశాంత్‌ను ఇంటి పైకప్పు నుంచి తోసివేయగా, అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన తర్వాత, సెలైన్ బాటిల్‌లో టాయిలెట్ క్లీనర్ కలిపి అతనికి ఎక్కించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, నిందితుల పాత్ర బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి భార్య సంధ్యతో పాటు అనిల్, వెంకటసాయిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.