BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 06 July 2026, 08:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వివాహేతర సంబంధం కోసం భర్త హత్య.. హార్పిక్‌ను నరాల్లోకి ఎక్కించి దారుణం

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 08:06 PM
161 వీక్షణలు

నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్, సంధ్య దంపతుల మధ్య వివాహేతర సంబంధాల కారణంగా ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీశాయి.

పోలీసుల వివరాల ప్రకారం, సంధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని భర్త ప్రశాంత్ ప్రశ్నించడంతో అతడిని శాశ్వతంగా తొలగించుకోవాలని సంధ్య కుట్ర పన్నింది.

పథకం ప్రకారం ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించింది. అనంతరం ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేసి భవనం పై నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలైనా ప్రాణాలతో బయటపడ్డాడు.

అయితే అతడిని ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ హార్పిక్‌ను సిరంజిలోకి తీసుకుని నరాల్లోకి ఎక్కించినట్లు పోలీసులు గుర్తించారు. విషపూరిత రసాయనం శరీరంలోకి చేరడంతో ప్రశాంత్ కొద్దిసేపటికే మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.