BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 17 June 2026, 05:44 pm
Posted by : కూనురు మధు

చిట్యాల హైస్కూల్‌లో 'గణిత ప్రతిభావంతులకు' నగదు పురస్కారాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 Jun, 2026 - 05:44 PM
399 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గణిత అధ్యాపకులు (నల్లగొండ జిల్లా తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు) దాసరి శ్రీరాములు తన చదువుల తల్లిపై ఉన్న మక్కువను చాటుకున్నారు. తాను బాల్యంలో చదివిన చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు, తన తల్లిదండ్రుల పై ప్రేమతో  ఏర్పాటు చేసిన "దాసరి సత్తమ్మ సాయిలు విద్యా, సాహిత్య సహకార సంస్థ" తరఫున విద్యార్థులకు  నగదు బహుమతులను అందజేశారు. ​పాఠశాలలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన పేదరికాన్ని జయించడానికి ఈ ప్రభుత్వ బడిలో నేర్చుకున్న చదువే కారణమన్నారు. సమాజాన్ని, దేశాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన గణితశాస్త్రాన్ని ఇష్టపడి చదవాలని కోరారు. ప్రధానోపాధ్యాయురాలు

​పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సుశీల మాట్లాడుతూ ఇదే బడిలో చదివిన శ్రీరాములు గారు నేడు విద్యార్థులను ప్రోత్సహించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

​నగదు బహుమతులు పొందిన విద్యార్థులు: జి. సంకీర్తన, ఎండి. షాహిన్, బి. పూజ, ఎస్కే. యాస్మిన్, పి. శిరీష. ఉన్నారు. ​ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, కోణం శ్రీనివాస్, ఎ. పద్మజ, ఎ. కవిత, ఎన్. సైదులు,  ప్రసన్న,,  శైలజ, జె. మంజుల, ఎండి. సాదిక్, ఎం. జానకి, ఎం. సౌమ్య తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.