BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

చల్లూరు క్రషర్ విషయంలో బీర్ల అయిలయ్యకు సంబంధం లేదు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రాజపేట
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
22 Apr, 2026 - 08:55 AM
641 వీక్షణలు

చల్లూరు క్రషర్ విషయంలో బీర్ల అయిలయ్యకు సంబంధం లేదు-- క్రషర్ యజమాన్యం

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చెల్లూరు గ్రామంలో ఉన్న  క్రషర్ కు సంబంధించిన వ్యవహారంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ఎలాంటి సంబంధం లేదని క్రషర్ యజమానులు తెలిపారు మంగళవారం రోజున నిర్వహించిన మీడియా సమావేశంలో  వారు మాట్లాడుతూ కొంతకాలంగా వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాలు మరియు యూట్యూబ్ ఛానళ్లలో మా సంస్థలు శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మరియు శ్రీని డెవలపర్స్ పై. అలాగే మా యాజమాన్యం పై మరియు మా క్రషర్ విషయంలో వస్తున్న ఆరోపణలు మాకు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము.2019 ఏప్రిల్ నెలలో, మేము శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరుతో చల్లూరు గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో, సర్వేనెంబర్ 322 మరియు అనుబంధ నెంబర్లలో 70 ఎకరాల భూమికి DTCP ద్వారా లేఅవుట్ అనుమతులు పొందాము. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మరియు లేఅవుట్ ప్లాన్ పత్రాలు మా వద్ద ఉన్నాయి.లేఅవుట్ ప్రాంతంలో ఎక్కువగా రాయి ఉండటంతో, అభివృద్ధి పనుల కోసం బ్లాస్టింగ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, నా భర్త స్వర్గీయ  శ్రీ నారాయణరావు  2021లో క్రషర్ యూనిట్ స్థాపించాలని నిర్ణయించి, సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాల నుండి -ఇండస్ట్రీస్, పొల్యూషన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాల నుండి అవసరమైన అనుమతులు పొందారు. సంబంధిత పత్రాలు మా వద్ద ఉన్నాయి.మొదటి వెంచర్లో బ్లాస్టింగ్ ద్వారా వచ్చిన రాయిని మేము లేఅవుట్ రోడ్ల నిర్మాణం మరియు అభివృద్ధి పనుల కోసం మాత్రమే వినియోగించుకున్నాము. ఈ సందర్భంలో మైనింగ్ శాఖ వారు రాయల్టీ చెల్లించాలని నోటీసు ఇచ్చారు. మేము ఆ నోటీసును స్వీకరించి, వాయిదాల ద్వారా చెల్లించేందుకు అనుమతి పొంది, ఆ మేరకు చెల్లింపులు చేసి రసీదులు పొందాము.2024 ఆగస్టు 8న నా భర్త శ్రీ నారాయణరావు  మరణించడంతో, క్రషర్ యూనిట్ను శ్రీ హరికి లీజుకు ఇవ్వడం జరిగింది. ఈ లీజు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు మా వద్ద ఉన్నాయి.లీజు ఒప్పందం ప్రకారం, ఆయన ప్రతి నెలా లీజు మొత్తాన్ని మా బ్యాంక్ ఖాతాకు జమ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇలాంటి విషయాల్లో ప్రస్తుత ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్యని అనవసరంగా సత్య ఆరోపణలు చేయడం మాకు ఎంతో బాధ కలిగిస్తోంది.ఈ క్రషర్ వ్యవహారానికి ప్రస్తుత ప్రభుత్వంలోని ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్యకైనా, గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకైనా ఎటువంటి సంబంధం లేదు.