BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 27 June 2025, 10:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మిషన్ పరివర్తన లో భాగంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించిన చిట్యాల పోలీసులు

తెలంగాణ
27 Jun, 2025 - 10:02 AM
206 వీక్షణలు
మిషన్ పరివర్తన లో భాగంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించిన చిట్యాల పోలీసులు NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని యువత మద్యం, గంజాయి, పొగాకు వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి చెడుదోవ పడుతున్నారని చిట్యాల పోలీస్ వారు గ్రహించి, శుక్రవారం రోజున నార్కట్ పల్లి CI K.నాగరాజు ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలోని పుర ప్రముఖులతో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఇట్టి అఖిలపక్షం సమావేశంలో యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉండడానికి పురప్రముఖుల అభిప్రాయాలు సేకరించి యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ పుర ప్రముఖులతో అభిప్రాయాలు సేకరించి చిట్యాల యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉండడానికి చిట్యాల పోలీస్ వారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగినది. ఆ నిర్ణయాల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లలో పట్టుబడిన వారిపై బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని , వాహనాలు నడిపే మైనర్లపై చర్యలు ఉంటాయని, అర్ధరాత్రి అకారణంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి తీసుకునే వారిపైన అమ్మే వారిపైన చట్టరీత్య చర్యలు ఉండాలని స్కూల్, కాలేజ్ లలో మైనర్ లను ప్రేమ పేరుతో మభ్య పెట్టే వారిపై, కఠిన చర్యలు తీసుకోవాలని నార్కట్ పళ్లి సిఐ కె.నాగరాజుకు పుర ప్రముఖులు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి చిట్యాల MRO కృష్ణ, చిట్యాల WPSI అమ్రీన్ నసీహా, ప్రజాప్రతినిధులు చిట్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జడల చిన మలయ్య , కనకదుర్గ గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు, బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య, బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్, సి.పి.ఎం జిల్లా కమిటీ మెంబర్ జిట్ట నగేష్ మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube