BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 February 2026, 11:47 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

తెలంగాణ
12 Feb, 2026 - 11:47 PM
288 వీక్షణలు
బాలికల వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ NTODAY NEWS:  పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు  పుంగనూరు: పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో నివసిస్తూ చదువుకుంటున్న 9, 10వ తరగతి విద్యార్థినుల పాఠ్యపుస్తకాల పఠనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్, సైన్స్, గణిత శాస్త్రం వంటి విషయాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వసతి గృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, బాత్రూములను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, నీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థినుల ఆరోగ్యం మరియు విద్యాభ్యాసానికి కీలకమని పేర్కొన్నారు. వసతి గృహంలో అందిస్తున్న భోజన నాణ్యతను కూడా పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. విద్యార్థినులు అనారోగ్య సమస్యలకు గురికాకుండా తరచుగా ఏఎన్ఎంల ద్వారా కంటి పరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. #Punganur #SocialWelfareHostel #CollectorInspection #GirlsEducation #StudentWelfare #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube