BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 February 2026, 06:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కళ్యాణ కట్ట సదుపాయాలపై కలెక్టర్ సమీక్ష

తెలంగాణ
14 Feb, 2026 - 06:54 AM
181 వీక్షణలు
  మహాశివరాత్రి ఏర్పాట్లు: శ్రీశైలంలో కళ్యాణ కట్ట సదుపాయాలపై కలెక్టర్ సమీక్ష NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కళ్యాణ కట్ట (ముండన మండపం) వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను స్వయంగా తనిఖీ చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కళ్యాణ కట్టలో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నాయా, దుస్తులు మార్చుకునే గదులు సక్రమంగా నిర్వహిస్తున్నారా, తగినంత నీటి సౌకర్యం ఉందా వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించారు. పారిశుధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. గుండు గీయించుకునే భక్తుల నుండి వసూలు చేస్తున్న రుసుము, రశీదుల జారీ వంటి అంశాలపై వివరాలు సేకరించారు. నిర్ణయించిన చార్జీలకన్నా అధికంగా వసూలు చేయరాదని, పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు సిబ్బంది నియామకం, తాగునీరు, కూర్చునే సౌకర్యాలు, భద్రతా చర్యలను బలోపేతం చేయాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. #Srisailam #Mahashivaratri #TempleArrangements #PublicAdministration #Nandyal #DevoteeFacilities Follow us on Website Facebook Instagram YouTube