BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 January 2026, 03:22 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

తెలంగాణ
20 Jan, 2026 - 03:22 AM
361 వీక్షణలు
కదిరి మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలు చేపట్టాలి: సీఐటీయూ NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్: వినోద్ కుమార్  శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని కదిరి పట్టణ మున్సిపాలిటీలో మరణించిన మరియు పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. కదిరి మున్సిపాలిటీలో అనేక సంవత్సరాలుగా సుమారు 30 మంది కార్మికులకు సంబంధించిన కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకుని కారుణ్య నియామకాలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి మున్సిపల్ మేనేజర్ ఆరిఫుల్లాకు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లు: -మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగం కల్పించాలి. -స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు ఎంపికైన శానిటేషన్ కార్మికుల సంఖ్యను పెంచాలి. -మున్సిపల్ కార్యాలయంలో పీఎఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కన్సల్టెంట్‌ను నియమించాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు తిరుపాల్, జనార్ధన్, బాలకృష్ణ, లక్ష్మన్న, శ్రీనివాసులు, నరసింహమూర్తి, సీఐటీయూ పట్టణ కన్వీనర్ బాబ్జాన్, నాయకులు తాజుద్దీన్, ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. #CompassionateAppointments #KadiriMunicipality #CITU #MunicipalWorkers #WorkersRights #EmploymentJustice #LabourIssues #PublicSectorJobs #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube