BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

చిట్యాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

తెలంగాణ
13 Feb, 2026 - 10:21 AM
299 వీక్షణలు
చిట్యాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం – 12 వార్డుల్లో 9 స్థానాలు గెలుపు NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 9 స్థానాలు గెలుచుకోగా, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 2 స్థానాలు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. గెలుపొందిన వారందరూ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వార్డు వారీ ఫలితాలు: 1వ వార్డు: నాగిల్ల సుధాకర్ (ట్రాన్స్‌జెండర్, స్వతంత్ర అభ్యర్థి) – జిట్టా నాగేష్‌పై 102 ఓట్ల మెజార్టీ 2వ వార్డు: షేక్ షబానా అజీమ్ (బీఆర్ఎస్) – జడల చిన్నమల్లయ్యపై 96 ఓట్ల మెజార్టీ 3వ వార్డు: గాలి యాదమ్మ లింగయ్య (కాంగ్రెస్) – శేపూరి జయమ్మ రవీందర్‌పై 302 ఓట్ల మెజార్టీ 4వ వార్డు: కోనేటి ఎల్లయ్య (కాంగ్రెస్) – నేనావత్ కృష్ణ నాయక్‌పై 181 ఓట్ల మెజార్టీ 5వ వార్డు: గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు (కాంగ్రెస్) – దయ్యాల శ్రీకాంత్‌పై 34 ఓట్ల మెజార్టీ 6వ వార్డు: జెర్రిపోతుల సత్యనారాయణ (కాంగ్రెస్) – జడల ఆదిమల్లయ్యపై 89 ఓట్ల మెజార్టీ 7వ వార్డు: దేశపాక లత రాజేష్ (కాంగ్రెస్) – కూరేళ్ల జ్యోతి లింగస్వామిపై 11 ఓట్ల స్వల్ప మెజార్టీ 8వ వార్డు: కుక్కల మోహన్ (కాంగ్రెస్) – కందాటి రమేష్ రెడ్డిపై 143 ఓట్ల మెజార్టీ 9వ వార్డు: ఏర్పుల పరమేష్ (కాంగ్రెస్) – ఆగు అశోక్‌పై 253 ఓట్ల మెజార్టీ 10వ వార్డు: నిమ్మనగోటి శ్రీను (బీఆర్ఎస్) – సిల్వేరు శేఖర్‌పై 97 ఓట్ల మెజార్టీ 11వ వార్డు: బొబ్బలి సందీప్ రామ్ రెడ్డి (కాంగ్రెస్) – దుడ్డు భాగ్యమ్మపై 459 ఓట్ల మెజార్టీ 12వ వార్డు: పందిరి గీతా రమేష్ (కాంగ్రెస్) – మెండే సుజాత సైదులుపై 45 ఓట్ల మెజార్టీ సీనియర్ నాయకులకు షాక్ ఇచ్చిన యువ నాయకులు ఈ ఎన్నికల్లో యువత, మహిళలు, కొత్త అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా కనిపించింది. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులకు పోటీగా కొత్త అభ్యర్థులు గెలవడం చిట్యాల రాజకీయాల్లో కొత్త దిశగా మార్పును సూచిస్తోంది. ప్రచార సమయంలో స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం వీరి విజయానికి దోహదపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో చిట్యాల రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశం లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నూతన కౌన్సిలర్ల ముందున్న ప్రధాన బాధ్యతగా భావిస్తున్నారు. #ChityalMunicipality #MunicipalElections2026 #CongressVictory #TelanganaPolitics #NalgondaDistrict #LocalBodyElections #PoliticalNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube