BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 November 2025, 06:00 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నాలా విస్తరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

తెలంగాణ
24 Nov, 2025 - 06:00 AM
375 వీక్షణలు
93 లక్షల వ్యయంతో వరద నాలా విస్తరణ పనులను కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలన..!!! NTODAY NEWS: ఎల్బీనగర్ గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలో పి&టీ కాలనీ ఎస్‌.జి.ఆర్‌ టవర్స్‌ నుండి న్యూ గడ్డిఅన్నారం వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు జరుగుతున్న వరద నాలా విస్తరణ పనులను సోమవారం ఉదయం గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. న్యూ గడ్డిఅన్నారం మరియు పి&టీ కాలనీ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే వరద ముంపు సమస్య తీవ్రంగా ఎదురవుతున్నదని, ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు GHMC ద్వారా దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో సుమారు 1 కోటి రూపాయలతో ప్రధాన వరద కాలువ నిర్మాణం పూర్తయింది.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా 93 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న వరద నాలా విస్తరణ పనులు పూర్తయితే ఈ ప్రాంతాలకు పూర్తిస్థాయి నీరు నిల్వ మరియు ముంపు సమస్య తొలగిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పనులు నాణ్యతతో, ప్రమాణాలకు అనుగుణంగా, కాలపరిమితిలో పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో GHMC అసిస్టెంట్ ఇంజనీర్ మల్లికార్జున్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు, కాలనీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube