BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 17 June 2026, 11:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశీయ మార్గాల్లో ‘బేసిక్ ఫేర్’ టికెట్లు ప్రవేశపెట్టిన ఎయిరిండియా

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 11:43 AM
140 వీక్షణలు

దేశీయ ప్రయాణికులకు తక్కువ ధరలో విమాన ప్రయాణాన్ని అందించేందుకు Air India కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన దేశీయ రూట్లలో ‘బేసిక్ ఫేర్ ఫ్యామిలీ’ పేరుతో చౌక టికెట్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఆప్షన్ కింద ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేయవచ్చు. 15 కిలోల చెక్-ఇన్ బ్యాగేజీ, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజీ అనుమతి ఉంటుంది. అయితే ఉచిత భోజనం ఉండదు. బదులుగా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి తేలికపాటి పానీయాలు మాత్రమే అందిస్తారు.

ప్రయాణికులు అవసరమైతే ముందుగానే లేదా ప్రయాణానికి 24 గంటల లోపు ప్రత్యేక మీల్స్‌ను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. శాకాహారం, మాంసాహారం, జైన్, డయాబెటిక్ మీల్స్ వంటి ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

బేసిక్ ఫేర్‌తో పాటు వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ వంటి ఇతర ఛార్జ్ శ్రేణులు కూడా కొనసాగుతాయి. వీటిలో భోజనం సహా అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వినియోగదారుల స్పందన ఆధారంగా ఈ కొత్త టికెట్ విధానం కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.