BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 18 May 2026, 01:20 pm
Posted by : కూనురు మధు

కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ

తెలంగాణ
/ సూర్యాపేట
18 May, 2026 - 01:20 PM
215 వీక్షణలు

చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో గౌడ సామాజిక వర్గీయుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వర స్వామి దేవాలయం తాళాలు పగులగొట్టి హుండీలోని  నగదు చోరీ చేశారు. సుమారు రూ.10 వేలు దోచుకున్నట్లుగా గ్రామస్థులు తెలిపారు. గతంలో కూడా ఈ దేవాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఈ హుండీతో పాటు పక్కనే ఉన్న కనకదుర్గ దేవాలయంలో కూడా దుండగులు చోరీకి ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. గతంలో చిలుకూరు కాల్వ ఒడ్డు అభయాంజనేయ స్వామి, బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయాల్లో కూడా ఇలాంటి చోరీలు జరిగాయి. దేవాలయ చోరీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కంఠమహేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ సురగాని వెంకటేశ్వర్లు, గ్రామస్థులు కోరుతున్నారు.