BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

దళిత సాధికారతకు CDS కీలక వేదిక

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
04 Apr, 2026 - 08:36 PM
136 వీక్షణలు

దళిత సాధికారతకు CDS కీలక వేదిక

రూ.15 కోట్ల ఎండోమెంట్‌కు ప్రతిపాదనలు – సానుకూలంగా స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : బొరబండలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (CDS) దళితుల సమగ్ర అభివృద్ధికి ముఖ్య వేదికగా నిలుస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి CDSను సందర్శించి, కేంద్రంలోని సదుపాయాలు, కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా CDS చైర్‌పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య కేంద్ర భవన నిర్మాణం, అందుబాటులో ఉన్న సదుపాయాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరించారు. పార్కింగ్ సౌకర్యాలు, కామన్ హాల్, డైనింగ్ హాల్, పరిపాలన కార్యాలయాలు, ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ మరియు ఫిజికల్ లైబ్రరీలు, మీడియా రూములు, శిక్షణార్థుల వసతి గదులు, అత్యాధునిక ఆడిటోరియం, దళిత్ మ్యూజియం వంటి విభాగాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.

గత 26 సంవత్సరాలుగా దళితులు, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం CDS చేపట్టిన పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, విధాన సూచనలపై లక్ష్మయ్య వివరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి, తిప్పర్తి యాదయ్య తదితరులు కూడా కేంద్ర కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన పలు కీలక కార్యక్రమాలపై ప్రతిపాదనలు మంత్రికి సమర్పించారు. ముఖ్యంగా దళిత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, UPSC, TGPSC వంటి పోటీ పరీక్షలకు కోచింగ్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల పర్యవేక్షణ, భూహక్కుల పరిరక్షణ, సామాజిక-ఆర్థిక పరిశోధనలు, మహిళలు, యువతకు నాయకత్వాభివృద్ధి కార్యక్రమాలు, దళిత్ మ్యూజియం అభివృద్ధి, దళిత సాహిత్య డిజిటలైజేషన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడ్వాన్స్‌డ్ ఆర్కైవ్స్ స్థాపన వంటి అంశాలను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాల అమలుకు రూ.15 కోట్ల ఎండోమెంట్ ఫండ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ CDS పనితీరును ప్రశంసిస్తూ, “దళిత సాధికారతకు ఇది ఒక సమగ్ర వేదిక. ఇక్కడి మౌలిక వసతులు, పరిశోధనా సామర్థ్యం ప్రభుత్వానికి కూడా ఉపయోగపడగలవు” అని పేర్కొన్నారు. సమర్పించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.