BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 15 May 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై దాడి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:36 PM
151 వీక్షణలు

దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళపై డ్రైవర్‌, కండక్టర్ కలిసి దారుణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 12 రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బాధిత మహిళ సరస్వతీ విహార్ బస్టాండ్ వద్ద వేచి ఉండగా, అక్కడికి వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులోకి డ్రైవర్‌, కండక్టర్ బలవంతంగా లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం కదులుతున్న బస్సులోనే ఆమెపై దాడి చేసి, రాత్రంతా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వివరాలు, నిఘా దృశ్యాల ఆధారంగా నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మరోసారి మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన నిర్భయ ఘటనను తలపించేలా ఈ సంఘటన ఉండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.