BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 07 February 2026, 08:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారా?

తెలంగాణ
07 Feb, 2026 - 08:09 AM
275 వీక్షణలు
అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారా? బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవీ కాలంలో ఎప్పుడైనా పూలమాల వేసి గౌరవించారా అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప స్వామి దేవాలయం, చావటి వద్ద నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజ్యాంగంపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు “దయ్యాలు వేదాలు వల్లించినట్లు” ఉన్నాయని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి పార్టీలో చేర్చుకున్న చరిత్ర ఉన్న పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. మెట్‌పల్లి అభివృద్ధిపై కీలక హామీలు మంత్రి తన ప్రసంగంలో మెట్‌పల్లి పట్టణ అభివృద్ధిపై పలు హామీలు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం పట్టణంలోనే ఉండి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తానని తెలిపారు. ఎస్సారెస్పీ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు త్వరలోనే పట్టాలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో కొత్త రేషన్ దుకాణాలను మంజూరు చేస్తామని తెలిపారు. మెట్‌పల్లి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరమని, అప్పుడే పట్టణానికి ప్రాధాన్యంగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Metpally #Ambedkar #CongressParty #MunicipalElections #TelanganaPolitics #UrbanDevelopment Follow us on Website Facebook Instagram YouTube