BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
29 Nov, 2025 - 05:52 AM
167 వీక్షణలు

పల్లె దవాఖాన లో విధులకు హాజరుకాని ఎంఎల్ హెచ్ పి శ్రావణి కి షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్

NTODAY NEWS:బొమ్మలరామారం మండలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని, తదనుగుణంగా గర్భిణులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.శనివారం రోజున బొమ్మలరామారం మండలం, మర్యాల పల్లె దవాఖానని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.ఆకస్మిక తనిఖీ లో బాగంగా విధులకు హాజరు కానీ ఎమ్.ఎల్.ఎచ్.పి శ్రావణి కు షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పల్లె దవాఖానలో సిబ్బంది రెగ్యులర్ గా విధులకు వస్తున్నారా లేదా అని ఆరా తీసి ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరు కానీ ఎమ్.ఎల్.ఎచ్.పి శ్రావణి కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సిబ్బంది అందరూ అందుబాటు లో ఉండి వివిధ రకాల సమస్యలు పై ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన సేవలందించాలన్నారు. ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా అని ఏ.ఎన్.ఎంలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.పల్లె దవాఖానలో ఎంత మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని అడిగి రెగ్యులర్ గా చెకప్ కు వస్తున్నారా లేదా చూసుకోవాలని ఆశ వర్క్ లకు తెలిపారు. ఈ నెలలో ఏమైనా డెలివరీలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు.

అనంతరం మర్యాల గ్రామంలో పశు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..మొత్తం ఎంత మంది సిబ్బంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు.రోజు ఆసుపత్రికి పశువులను తీసుకొని ఎంత మంది వస్తున్నారని ఆరా తీశారు.టీకాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకొని,ప్రతి మూగ జీవాలకు గ్రామ గ్రామాన సమయానికి టీకాలు వేయాలన్నారు.

అనంతరం మర్యాల గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ... ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు పూర్తి చేశారని అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఎంత ఉందని అడిగి తెలుసుకున్నారు.ఎన్ని రోజుల్లో కొనుగోలు పూర్తి అవుతుందని అడిగి తెలుసుకోని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కేంద్రానికి సరిపోను లారీలు వస్తున్నాయా అని అడిగారు. కేంద్రంలో సరిపోను గన్ని బ్యాగ్ లు ఉన్నాయా అని అడిగి లారీలలో లోడ్ చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube