BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 July 2026, 05:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఈ నెల 14లోపు ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయాలి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:57 AM
106 వీక్షణలు

అమరావతి, జూలై 11: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, అర్హులైన ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్‌ను ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేసి సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)కు అందజేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.

అధికారుల సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అధిక శాతం ఎన్యూమరేషన్ వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా నమోదు చేయని ఓటర్లు గడువు ముగిసేలోపు తమ వివరాలను సమర్పించాలని కోరుతున్నారు.

ఎన్యూమరేషన్ ప్రక్రియను బీఎల్‌ఓ ద్వారా పూర్తి చేయడంతో పాటు, ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఆన్‌లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది.

గడువులోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయకపోతే ఓటర్ల జాబితాలో పేరు కొనసాగించేందుకు అవసరమైన ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రతి అర్హత కలిగిన ఓటరు నిర్ణీత గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.