BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 April 2026, 07:12 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లోక్‌సభ ముందుకు గురువారం డీలిమిటేషన్ బిల్లు కేంద్రం వైఖరిపై ఉత్కంఠ!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:12 AM
163 వీక్షణలు

ఈరోజు లోక్‌సభ ముందుకు డీలిమిటేషన్ బిల్లు  కేంద్రం వైఖరిపై ఉత్కంఠ!

మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026 తీసుకొస్తున్న కేంద్రం

లోక్‌సభలో మహిళల కోసం 33% రిజర్వేషన్లను అమలు చేసేందుకు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభలో సమర్పించనున్నారు. అనంతరం ఈ బిల్లుపై చర్చ జరగనుంది.

ఈ బిల్లు ప్రకారం, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 850కు పెంచాలని ప్రతిపాదించబడింది. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాల నుంచి, 35 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉంటాయి. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 సవరణకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 530 స్థానాల పరిమితిని పెంచడం, కొత్తగా 850 స్థానాల సవరింపుని ప్రతిపాదించడం కీలకంగా కనిపిస్తోంది.

మహిళా రిజర్వేషన్ల పై కీలక నిర్ణయాలు

2029 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అందించేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (2026) తీసుకొస్తున్న కేంద్రం, 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టే దిశగా ఆర్టికల్ 81(3)లో సవరణలు ప్రతిపాదించింది.

ఇప్పటికీ, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా లేదా 2011 లెక్కల ఆధారంగా ఇది జరగడం, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

డీలిమిటేషన్ కమిషన్

మహిళా రిజర్వేషన్లకు అనుగుణంగా, దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. బిల్లు చట్టరూపం దాల్చిన తరువాత, ఈ కమిషన్ పనిలో పడుతుంది.

ఈ కమిషన్ క్రింద, రాష్ట్రాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన 10 మంది సభ్యులు, సుప్రీం కోర్టు నియమించే ఛైర్‌పర్సన్, కేంద్ర ఎన్నికల కమిషనర్, మరియు రాష్ట్ర ఎన్నికల అధికారులు సభ్యులుగా ఉంటారు.

ఇటువంటి పార్లమెంటు, అసెంబ్లీల పునర్విభజనలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాన్ని కూడా పరిగణనలో తీసుకుంటారు.