BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 06 June 2026, 06:07 pm
Posted by : V శ్రీనివాస్

ఎంపీ వంశీకి బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదు: నగునూరి వెంకటేశ్వర గౌడ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 06:07 PM
225 వీక్షణలు
పెద్దపల్లి ఎంపీ వ్యాఖ్యలపై మంచిర్యాలలో బిజెపి వినూత్న నిరసన

​బిజెపి నాయకులు రఘునాథ్ వెర్రబెల్లి, పార్టీ కార్యకర్తలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన పరుష వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసరాల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ చిత్రపటాన్ని ప్రజలకు చూపిస్తూ ‘ఈయనను గుర్తించారా’ అంటూ నిరసనకారులు ప్రశ్నించారు. అనంతరం వెంకటేశ్వర గౌడ్ మాట్లాడుతూ.. తాత, తండ్రుల వారసత్వంతో, వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ అయిన వంశీకి.. దేశం కోసం, పార్టీ కోసం పస్తులుండి కష్టపడే బిజెపి కార్యకర్తలను విమర్శించే నైతిక స్థాయి లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

​కొన్ని సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ ఎదుట ముసుగేసి ఉన్న సొంత తాత, దివంగత వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించుకోలేని తండ్రీకొడుకులు.. కేంద్ర నిధులపై అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సొంత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అధికారులు తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని బాధపడే ఏకైక ఎంపీ వంశీ అని, బయట మాత్రం తానే గొప్పగా నిధులు తెచ్చానని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటన్నారు. మంచిర్యాలలో ఒక ‘కేరళ ఎక్స్‌ప్రెస్’ స్టాపేజ్ కూడా ఇప్పించలేని వారు కేంద్ర నిధులు తెచ్చామనటం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, నాయకులు ఎనగందుల కృష్ణమూర్తి, జోనల్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు, కుర్రి చక్రవర్తి, సత్రం రమేష్, కౌన్సిలర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత సత్యనారాయణతో పాటు బిజెపి జిల్లా, మంచిర్యాల కార్పొరేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు