BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 13 April 2026, 02:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతుల సమస్యలను తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బృందం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 02:53 PM
207 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బృందం రైతుల సమస్యలను పర్యటించి తెలుసుకుంది

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం, రేపూడి, పడమర, మాధవరం గ్రామాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత కిసాన్ మహాసభ బృందం మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించింది. ఈ పర్యటనలో డి. హరినాథ్ మాట్లాడుతూ, "రైతులు తమ ఉత్పత్తి చేసిన మొక్కజొన్నకు ఎకరాకు 70,000 రూపాయల పైగా పెట్టుబడులు పెట్టి, క్వింటాల్ 1600-1700 రూపాయల ధరలో అమ్మాలని చూస్తున్నారు. కానీ, దళారులు 1300-1400 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతులను మోసగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రకారం, క్వింటాల్ 2400 రూపాయల ధర ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది." "రైతుల వద్ద చెల్లింపు కోసం అధిక ధర పలకటమే కాకుండా, తడి శాతం లేనప్పటికీ 'తడి శాతం ఉంది' అని చెప్పి ధరను తగ్గించడం జరుగుతోంది. ఈ పరిస్థితి వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది," అని ఆయన అన్నారు. "ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఎన్నికల సమయంలో మాత్రమే పర్యటించడం తప్ప, రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోడంలేదు. తక్షణమే ఏ కొండూరు మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే, రైతులు నిరసన ఆందోళన చేపడతారు," అని హరినాథ్ హెచ్చరించారు.