BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 November 2025, 10:10 am
Posted by : NTODAY NEWS OFFICIAL

15 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ

తెలంగాణ
24 Nov, 2025 - 10:10 AM
179 వీక్షణలు
తిరుమలనాధ దేవస్థాన భూములకు హద్దులు ఏర్పాటు NTODAY NEWS: చిట్యాల 15 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయ భూమికి సర్వే నెంబర్ 201 లోని 102 ఎకరాల భూమికి గుట్టకు నాలుగు వైపులా సర్వే నిర్వహించి హద్దురాలను ఏర్పాటు చేశారు. గత 13 నెలలుగా పలుమార్లు గ్రామస్థాయి నుండి జిల్లా కలెక్టర్ వరకు గ్రామానికి చెందిన ప్రముఖులు ఫిర్యాదు చేయటంతో సోమవారం రోజున నల్గొండ డిప్యూటీ సర్వేయర్ పవన్ కుమార్ సర్వే నిర్వహించి గుట్టకు నాలుగు వైపులా హద్దురాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే దేవాలయ భూములకు కంచెను ఏర్పాటుచేసి దేవాలయ భూములను రక్షిస్తామని . ఇకపై దేవస్థాన భూమిలో రోడ్డు పనులు గాని మట్టి తవ్వకంగాని ఎలాంటివి కూడా చేపట్ట వద్దని చేపట్టిన యెడల చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సుమారు 15 ఎకరాల పైగా అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ రజినీకాంత్, దేవస్థాన అధికారులు సుమతి, అంబాటి నాగిరెడ్డి, గ్రామ జిపిఓ రాణి, డిప్యూటీ తాసిల్దార్ సురేష్, గ్రామ ప్రముఖులు చేకూరి గణేష్ మాదిగ, పొట్లపల్లి చిన్నస్వామి, పొట్లపల్లి నరసింహ, నీలకంఠం లింగస్వామి, ఏర్పుల దామోదర్, ఏర్పుల రాకేష్, పున్న విష్ణు, మాచర్ల యాదగిరి, ఏర్పుల సత్తయ్య, పొట్లపల్లి వేణు, మోర రాములు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube