BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 November 2025, 05:47 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సుందరయ్య పార్క్‌లో త్రవ్వకాలు, గ్రీనరీ తొలగింపు ఆపాలి

తెలంగాణ
20 Nov, 2025 - 05:47 AM
329 వీక్షణలు
సుందరయ్య పార్క్‌లో త్రవ్వకాలు, గ్రీనరీ తొలగింపు ఆపాలి NTODAY NEWS: హైదరాబాద్ సుందరయ్య పార్కు లో గ్రీనరీని కాపాడాలని మరియు పార్క్‌లో త్రవ్వకాలు, గ్రీనరీ తొలగింపు ఆపించాలని, వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌, హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం HCF డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు (20.11.2025) సుందరయ్య పార్క్ లో తవ్వకాలు నిర్వహిస్తున్న దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ ఏవిపి సంపత్ రెడ్డి మాట్లాడుతూ సుందరయ్య పార్క్‌లో పది రోజుల నుండి పచ్చదనానిచ్చే గ్రీనరీని తొలగించి, పిల్లల ఆట వస్తువులు పెడతామన్న జిహెచ్‌ఎంసి అధికారుల చర్యలు ఆపాలని అన్నారు. సుందరమైన పార్క్‌ గ్రీనరీ తొలగింపుతో, సుందరయ్య పార్క్‌ రూపురేఖలు మారిపోతయాని అన్నారు. 2026 డిస్టిక్ గవర్నర్ శైలజ మోహన్ మాట్లాడుతూ పిల్లల ఆట వస్తువులను గతంలో ఉన్న పిల్లల ఆట స్థలంలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొంగల వల్ల ప్రతి సంవత్సరం పార్కు దెబ్బ తినకుండా కూడా తగిన ఏర్పాటు చేయాలని కోరారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా పార్కులో పిల్లల కోసం గతంలో ఉన్న పిల్లల ఆట స్థలంలోను, ఇతర స్థలాలలో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. హెచ్ సి ఎఫ్ ప్రధాన కార్యదర్శి వీరయ్య మాట్లాడుతూ నగరంలో ప్రతిష్టాత్మకమైనది సుందరయ్య పార్క్‌ అని, ఆహ్లాదానికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా ఉన్నదని అన్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, రోగాల బారిన పడకుండా ఉండటానికి, శరీరానికి రోజూ ఎంతో కొంత నడక, వ్యాయామం అవసరం అన్నారు. సుందరయ్య పార్క్‌ చక్కటి వాతావరణాన్ని కల్పిస్తూ వాకర్స్‌ నడవడానికి వాకింగ్‌ ట్రాక్‌, స్వచ్చమైన గాలిని పీల్చుకోవడానికి పచ్చని చెట్లు ఉండడంతో రోజు 2000 మందికి పైగా వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రమేష్ రెడ్డి , దశరథ్, స్కైలాబ్ బాబు, రాజశేఖర్ , కుమార్, మాణిక్యం, హెచ్ సి ఎఫ్ అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య, నాయకులు పి నాగేశ్వరరావు, రమేష్, శంకరయ్య, నాగేష్, గోపాల్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube