BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 March 2026, 12:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

తెలంగాణ
04 Mar, 2026 - 12:23 AM
182 వీక్షణలు
బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు లారీని ఢీకొన్న కారు.. ఐదుగురు అక్కడికక్కడే మృతి పుంగనూరు: బెంగళూరు–చెన్నై జాతీయ రహదారి బైపాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ఉదయం బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం, సిమెంట్ లోడ్‌ను దించి నెల్లూరుకు తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇనోవా యారిస్ కారు తన లారీని బలంగా ఢీకొట్టిందని పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న గంగవరం, పలమనేరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఎక్స్‌కవేటర్ సహాయంతో లారీ వెనుక ఇరుక్కున్న కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. మృతుల వివరాలు మోహన్ దాస్ (71) నాగరాజరావు (61) కుసుమ (61) జయంతి (59) పూజ (33) ప్రమాదంపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి గంగవరం మండలంలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. #RoadAccident #BangaloreChennaiHighway #Punganur #Gangavaram #AndhraPradeshNews #BreakingNews Follow us on Website Facebook Instagram YouTube