మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి తనిఖీలు
తెలంగాణ
మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి తనిఖీలు
NTODAY NEWS: శ్రీశైలం/ నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున్
నంద్యాల, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రంలో భక్తుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లడ్డూ కౌంటర్, శివాజీ గోపురం, అమ్మవారి ఆలయం, గుడి లోపలి ప్రదేశాలు, నాగుల కట్ట, చంద్రావతి కళ్యాణ మండపం, విఐపీ ప్రవేశ ద్వారం, హరిహరరాయ గోపురం తదితర ప్రాంతాలను సందర్శించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనే అంశంపై అధికారులతో చర్చించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై, ఉత్సవాల కాలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో సమన్వయంతో పని చేసి, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
#Nandyal #Srisailam #MahaShivaratri #PoliceBandobast #TempleSecurity #AndhraPradeshNews #FestivalArrangements
Follow us on
Website
Facebook
Instagram
YouTube